
మనిషి ఎంత పరిగెత్తినా.. ఎంత బిజీ, ఎంత బిజీగా గడిపినా తాను తినేది నాలుగు గింజలే.. ఒకరి నోటి దగ్గర గింజలు లాక్కొని తినకుండా కష్టపడి పనిచేసే వారు అసలు సిసలైన మనుషులు.. రోజు కూలి నుంచి ప్రతి ఒక్కరు బతుకుపోరాటంలో ఎందరో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎదురీదుతున్నారు.
ఒక పెద్దాయన రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని లెక్కిస్తున్న పోటోలు, వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతూ పలువురి హృదయాలను మెలిపెడుతోంది. ఈ వైరల్ వీడియోను, ఫోటోలను జిందగి గుల్జార్ హై అనే పేజ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ షార్ట్ క్లిప్‌లో ఆ రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని కౌంట్ చేయడం కనిపిస్తుంది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయిన కొద్ది సేపటికే మూడు లక్షల వ్యూస్‌కు చేరువైంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. నీకున్నదాంతో సంతోషంగా ఉండు…నీ చిన్న గది, చిరు ఆదాయం, స్మార్ట్ గాడ్జెట్ల వంటివి కూడా లగ్జరీనే..వాటి పట్ల కృతజ్ఞత చూపించు..దయతో వ్యవహరించు అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. వీడియో హృదయాన్ని తాకిందని, జీవితం అందరికీ ఒకేలా ఉండదని మరో యూజర్ కామెంట్ చేశారు.