ఆవుతో అసెంబ్లీకి వ‌చ్చిన నిర‌స‌న చేస్తున్న ఎమ్మెల్యె..

Share On

రాజ‌స్థాన్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యె జంతువుల‌ను ప‌ట్టి పీడిస్తున్న లంపీ చ‌ర్మ‌వ్యాధిపై ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆవుతో అసెంబ్లీకి వ‌చ్చారు. ప్రభుత్వం వ్యాధి నివారణ చర్యలు చేపట్టేలా వినూత్నంగా నిరసన చేపట్టాలని ఆయన భావించారు. కానీ ఎమ్మెల్యే అనుకున్నది మాత్రం జరగలేదు. ఆవుతో అసెంబ్లీ సమీపానికి చేరుకోగానే.. అది అక్కడినుంచి పారిపోయింది. ఒక‌ వ్యక్తి గొలుసుతో పట్టుకొని ఉండగా.. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడటం ప్రారంభించగానే ఆవు అక్కడినుంచి పరుగులందుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రావత్‌ మీడియాతో మాట్లాడుతూ.. లంపీ చర్మవ్యాధితో ఆవులు మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. పశువులను బలిగొంటున్న ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం దృష్టిసారించాలని, అందుకే ఆవుతో నిరసన తెలియజేసేందుకు అసెంబ్లీ వద్దకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజస్థాన్‌లో లంపీ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటికే 13,02,907 పశువులకు సోకగా 59,027 మరణించినట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu