
ఎప్పుడు పట్టుకోలేనంతగా.. ఎవరూ ఊహించనంతగా ఢిల్లీ పోలీసులు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. ఒక కంటైనర్‌లో దాచిన.. 20 టన్నుల హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల పట్టుకున్న డ్రగ్స్ కేసులో అతి పెద్దది ఇదే. ముంబైలో దొరికిన ఈ డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు 1725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను చూసి పోలీసులు కూడా ఖంగుతిన్నారు. ఆయుర్వేదంలో వినియోగించే అతి మధురానికి హెరాయిన్ పూతపూసి వీటిని తరలించారని పేర్కొన్నారు.
డ్రగ్స్‌ను గ్రాముల్లో ప్యాక్ చేసి తరలించాలన్నా.. చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది.. ఏకంటా టన్నులకు టన్నులు ఇక్కడికి ఎలా తరలించారన్నదే అర్ధం కావడం లేదు. వ్యవసాయ ఎరువులు తరలించినంత ఈజీగా.. పెద్ద పెద్ద బ్యాగుల్లో డ్రగ్స్‌లు తరలించారంటే… కేటుగాళ్లు ఎంత పక్కాగా స్కెచ్‌లు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పోర్టుల్లో భద్రత కొరవడిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారుల హస్తం లేనిదే.. ఎంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను దేశంలోకి ఎవరూ తీసుకురాలేరన్న ఆరోపణలు వస్తున్నాయి.