మోడీ పర్యటనల ఖ‌ర్చులు వెబ్‌సైట్‌లో లేవు..

Share On

సభలు, సమావేశాలంటూ నాయకులు దేశాల పర్యటనలు చేస్తుంటారు.. ఏ దేశానికి ఏ సమావేశానికి వెళతారో తెలియదు.. కాని పర్యటన వెళ్లిన ప్రతిసారి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతూనే ఉంటాయి.. ఆ డబ్బంతా ప్రజల కష్టపడి కడుతున్న పన్నుల డబ్బే.. అసలు ఏ నాయకుడు ఎక్కడికి పర్యటిస్తున్నాడు. ఎంత ఖర్చు అవుతోందని తెలుసుకొని ప్రయత్నం చేయగా సరియైన సమాధానం మాత్రం రాలేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర తెలిపారు..

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటివరకు ఎన్ని దేశాల పర్యటన చేశారు. అందుకు ఎంత ఖర్చు చేశారు. అందుకు సంబంధించిన పర్యటన వివరాలు, ఖర్చుల వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి దరఖాస్తు చేసింది..

ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు పలు దేశాలలో పర్యటించారు. పర్యటన వివరాలు, వాటి ఖర్చుల వివరాలు పిఎంఓ వెబ్ సైట్ లో ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయ పిఐఓ సమాధానం ఇచ్చారు. కాని పిఎంవో వెబ్ సైట్ లో సరియైన సమాధానమే లేదు. ఇప్పటివరకు ప్రధాని మోడీ 66దేశాలకు వెళ్లినట్టు వెబ్ సైట్ లో ఉంది కాని, ఆ దేశాల పర్యటనకు సంబంధించిన ఖర్చుల వివరాలను మాత్రం పొందపర్చలేదు.. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి వెబ్ సైట్ లో ఆయన పర్యటన ఖర్చుల వివరాలు పెట్టుకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. పరిపాలనలో పారదర్శకత కోసం పనిచేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం తమ కార్యాలయంలో వెబ్ సైట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu