వామ్మో.. అగ్రరాజ్యం అమెరికాలో ఇవేం వావి వరసలో విన్నారా..

Share On

Wife shares husband with mother and

మనిషి ఆలోచనలు రోజురోజుకు ఏలా మారుతున్నాయో అర్థం కావడం లేదు.. వావి వరసలు మరిచిపోయి మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. తనకు మూడ్ లేనప్పుడు తన భర్తకు శృంగారం కావాలనుకుంటే తన తల్లితో కాని, చెల్లితో కాని శృంగారం చేసుకునే అవకాశాన్ని ఆ భార్య కల్పించింది. అందుకు తల్లి, చెల్లిని కూడా ఒప్పించింది. 

అమెరికాకు చెందిన మాడీ గ్రూప్స్ అనే మహిళ తాజాగా టిక్ టాక్ లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ టిక్ టాక్ వీడియో సంచలనంగా మారింది. తాను,తన తల్లి ఇద్దరూ స్వింగర్లు అని మాడీ ఆ వీడియోలో తెలిపింది. స్వింగర్ అంటే సామాజిక లైంగిక కార్యకలాపాలు లేదా స్వింగింగ్ లో పాల్గొనే వ్యక్తి. స్వింగింగ్ అనేది సామాజిక సెక్స్ యొక్క ఒక రూపం. సింగిల్స్, జంటలు,.. వివిధ రకాల లైంగిక భాగస్వామ్యం లేదా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంలో పాల్గొనటాన్ని స్వింగింగ్ అంటారు. అయితే తాను మూడ్ లో లేని సమయంలో తన భర్తను, తన తల్లితో సెక్సువల్ రిలేషన్ తో ఉండేందుకు వారానికి రెండుసార్లు పర్మిషన్ ఇచ్చినట్టు ఆ వీడియోలో మాడీ తెలిపింది. అలాగే తన చెల్లితోనూ తన భర్త శృంగారం చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు మాడీ ఆ వీడియోలో తెలిపింది. తాను,తన తల్లి,చెల్లి ముగ్గురూ కలిసి ఒక అండర్ స్టాండింగ్ తో ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు మాడీ తెలిపింది. ఇలాంటి రిలేషన్ షిప్ ని అమెరికాలో ప్రస్తుతం ఓపెన్ రిలేషన్ షిప్ అని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి ఓపెన్ రిలేషన్షిప్ ట్రెండ్ కొనసాగుతోంది.

ప్రస్తుతం మాడీ గ్రూప్స్ టిక్ టాక్ అకౌంట్ డిలీట్ అయింది. కానీ ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం ఇస్సుడు అన్ని సోషల్ మీడియా సైట్లలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాను మూడ్ లో లేని సమయంలో తన భర్త తన తల్లితోనూ చెల్లితోనూ ఎంజాయ్ చేశాడని ఇలా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని టిక్ టాక్ వీడియోలో మాడీ చెప్పిన మాటలు విన్న నెటిజన్లు షాక్ కు గురయ్యారు. కాగా,ఓపెన్ రిలేషన్ షిప్ ట్రెండ్ వల్ల మానవ సంబంధాలు ఆటవికంగా మారిపోయి చివరకు వావివరసలు మరిచిపోయే స్థాయికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది అమెరికన్లు బహిరంగ సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు, ఇందులో 21 శాతం మంది భార్యలతో పాటు 30 శాతం మంది భర్తలు ఆసక్తిని వ్యక్తం చేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu