కెన‌డా ఉన్న భార‌తీయుల‌కు భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌..

Share On

కెనడాలో విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయ‌ని అక్క‌డ నివ‌సిస్తున్న భార‌తీయులు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు భారీగా పెరిగాయి. మరోవైపు.. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు! అయితే, విదేశాంగ శాఖతోపాటు కెనడాలోని భారత హైకమిషన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరాయి’ అని ప్రకటనలో పేర్కొంది.

‘ఈ పరిస్థితుల నేపథ్యంలో.. కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులతో పాటు ట్రావెల్‌, ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలి. నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియాతోపాటు టొరంటో, వాంకోవర్‌లలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాల సంబంధిత వెబ్‌సైట్‌లు లేదా మదద్‌(madad.gov.in) పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంప్రదించేందుకు భారత అధికారులకు అవకాశం లభిస్తుంది’ అని తెలిపింది.

ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)’ ఆధ్వర్యంలో ఖలిస్థాన్‌ రెఫరెండం నిర్వహించారు. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశవ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు అక్కడి ఓ ఆలయంపైనా దాడి జరిగింది. ఈ విధమైన వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu