చిన్నారుల అశ్లీల స‌మ‌చార క‌ట్ట‌డిపై కేంద్రం కొర‌డా..

Share On

ఇంట‌ర్‌నెట్‌లో చిన్నారుల అశ్లీల సమాచార కట్టడికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశవ్యాప్త దాడులకు దిగింది. ఆపరేషన్ ‘మేఘచక్ర’ పేరిట.. 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 56 చోట్ల తనిఖీలు చేపట్టింది. పిల్లలపై లైంగిక హింసకు సంబంధించిన సమాచార వ్యాప్తికి పాల్పడే ముఠాలను.. మైనర్లను బ్లాక్‌ మెయిల్ చేసే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే నిమిత్తం ఈ దాడులు చేపట్టింది.

సింగపూర్‌ నుంచి అందిన సమాచారం, అలాగే గత ఏడాది కార్బన్‌ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌ నుంచి పొందిన ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా తాజా సోదాలు జరిగాయి. ఈ సమాచార ప్రసారానికి ముఠాలు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్ లక్ష్యంగా ఆపరేషన్ కార్బన్ జరిగింది. దానికి అనుబంధంగా తాజాగా ఆపరేషన్‌ను చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్నోగ్రఫీ కేసుల్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ గతవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu