న‌ల్ల‌గా ఉన్నావంటూ భ‌ర్త అవ‌హేళ‌న చేస్తున్నాడ‌ని..

Share On

ఇద్ద‌రు మ‌నుషులు ఇష్ట‌ప‌డి పెళ్లిచేసుకోవాలంటే వారి మ‌న‌సులు క‌ల‌వాలి.. అందంతో అంత‌గా ప‌ని ఉండ‌దు.. కాని క‌ట్టుకున్న భ‌ర్త భార్య‌ను న‌ల్ల‌గా ఉన్నావంటూ ప‌దే ప‌దే అవ‌హేళ‌న చేయ‌డంతో ఆ భార్య భ‌రించ‌లేక‌పోయింది. త‌న కోపాన్ని భ‌రించ‌లేక ఆ భ‌ర్త‌ను భార్య గొడ్డ‌లితో న‌రికి చంపింది. ఈ ఘ‌ట‌న చ‌త్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలేశ్వర్‌ గ్రామానికి చెందిన అనంత్‌ సాన్‌వాని(40) నల్లగా ఉన్న తన భార్య సంగీతను అసహ్యంగా పిలిచేవాడు. ఆమె శరీరఛాయపై అవహేళన చేసేవాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఉద్రేకం పట్టలేని సంగీత తన భర్తపై ఇంట్లోని గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది. అంతేకాకుండా అతడి జననాంగాలను కోసేసింది. సోమవారం ఉదయం తన భర్తను ఎవరో హతమార్చారంటూ గ్రామస్థులకు చెప్పింది. అయితే పోలీసు విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu