బెంగుళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్‌..

Share On

బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ కొత్త స్టార్ట‌ప్ ప్రారంభించింది. ప్రియుడు మోసం చేశాడ‌నే, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో కుంగిపోయిన వారికి బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు ఇచ్చేందుకు ‘Toy boy’ అనే వెబ్‌ పోర్టల్ ని,యాప్ ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం లవ్ బ్రేకప్ అయిన లవర్స్‌ను కాపాడటమే అని తెలిపింది. గంటలెక్కన బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకిస్తామని కంపెనీ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే “బాయ్‌ ఫ్రెండ్” ఎవరి దగ్గరికీ భౌతికంగా రాడు. ఫోన్‌ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు. బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకున్న వారు వాళ్లతో కలిసి షాపింగ్‌, రెస్టారెంట్లు, పార్కులకు వెళ్లడం సెక్స్ చేసుకోవడం నిషిద్ధం. బాయ్ ఫ్రెండ్ కేవలం ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండాడు. యూజర్లు తమ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు. జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి.

మానసికంగా బాధపడేవారికి, ఒంటరితనంతో బాధపడేవారికి సానుకూలమైన మాటలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఇప్పటికే చాలా వెబ్ సైట్లు ఉన్నాయి. అయితే ప్రేమలో విఫలమైన యువతులను ఉద్దేశించి టాయ్ బామ్ పేరుతో అబ్బాయిలను అద్దెకు ఇస్తామనడమే ప్రస్తుతం ఇక్కడ వివాదాస్పదమైంది. ఇక దీనిపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. . కాగా, జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu