ర‌ష్యా చేతికి చిక్కిన ఉక్రెయిన్ సైనికుడి దారుణ ప‌రిస్థితి..

Share On

ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో క‌దిలించే హృద‌య‌విదార‌క దృశ్యాలు ఉన్నాయి. ఏడు నెలలు గ‌డిచినా ఇంకా యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా రష్యా చెర నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుల దుస్థితిని ఆ దేశం వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికిబయటపడ్డాడంటూ మైఖైలో దియనోవ్‌ అనే సైనికుడి చిత్రాలను షేర్ చేసింది. అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేస్తున్నాయి.

రష్యా ఈ విధంగా జెనీవా ఒప్పందాలను కాలరాస్తోంది. ఈ విధంగా నాజీల వారసత్వాన్ని కొనసాగిస్తోంది’ అంటూ రష్యాపై ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే క్రమంలో దియనోవ్‌ రష్యా సైనికులకు చిక్కాడు. గత బుధవారం విడుదలైన 205 మంది సైనికుల్లో ఇతడు కూడా ఉన్నాడు. దియనోవ్‌కు సంబంధించి తాజా చిత్రంలో.. అతడు చాలా బలహీనంగా కన్పిస్తున్నాడు. ముఖం, చేతులపై గాయాల గుర్తులున్నాయి. ప్రస్తుతం కీవ్‌ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతడి సోదరి అలోనా వెల్లడించారు. రష్యా చెరలో అమానవీయ పరిస్థితుల కారణంగా చేతిలో కొంత ఎముకను కోల్పోయాడని చెప్పారు. తన సోదరుడు బరువు పెరిగే వరకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్స అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా, మానసికంగా బలంగా ఉన్నాడని తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu