ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి..

Share On


కార్లలో ప్రయాణించే వ్యక్తుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు తప్పనిసరి చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది..

కంపెనీలన్నీ విధిగా ఆ తేదీ నుంచి కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు ఏర్పాటుచేయాల్సి ఉంటుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌లో వెల్లడించారు. తొలుత ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచే దీన్ని అమలు చేసేందుకు కసరత్తు చేసిన కేంద్రం.. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అక్టోబర్ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను (నాలుగు సీట్లతో సహా రెండు సైడ్ ఎయిర్‌ బ్యాగ్‌లు) ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటొన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్టు గడ్కరీ తెలిపారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌బ్యాగులను అమలు చేయాలని, మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu