
విశాఖ నగర పోలీసులు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు నోటీసులు అందజేశారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌కు విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర వెళ్లి వాటిని అందజేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. 500 మందికిపైగా ర్యాలీలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
‘విశాఖ గర్జన’ ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఏపీ మంత్రులు కొందరిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘జనవాణి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో భారీగా జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు వైకాపా నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించకుండా ఆంక్షలు విధించి నోటీసులు అందజేశారు.