ఆ గ్రామంలో అంద‌రూ కుంభ‌క‌ర్ణులే.. ఎందుకంటే

Share On

భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి చేసే పనేమిటి అంటే అందరూ విడ్డూరంగా చూస్తారు.. ఎందుకంటే అందరూ పగలంతా బతకడానికి ఏదో ఒక పనిచేస్తూ, రాత్రిళ్లు పడుకుంటారు.. అందరూ చేసే పని ఇదే.. కాని కొన్ని గ్రామాల్లోని విచిత్రమైన సంఘటనలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..

పురాణాలలో రామాయణం గురించి తెలిసిన వారికి రావణాసుడి తమ్ముడు కుంభకర్ణుడు గురించి అందరికి తెలుసు.. ఎవరైనా ఎక్కువ సమయంలో నిద్ర పోతుంటే.. వాడికి కుంభకర్ణుడి తమ్ముడిలా ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తారు.. అలాంటి కుంభకర్ణుడిలా నిద్రపోయే గ్రామం ఒకటి ఉంది.. ఆ గ్రామంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది.. నెలల తరబడి నిద్రపోతుంటారు.. ఆ గ్రామం కజకిస్తాన్‌లో ఉంది.

ప్రజలు సుదీర్ఘంగా నిద్రపోయే గ్రామం కలాచి. అందుకనే ఈ గ్రామాన్ని స్లీపీ హాలో అని కూడా పిలుస్తారు. ఈ విచిత్రమైన గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. దాదాపు 160 మంది నిద్రపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిద్రపోయిన తర్వాత గ్రామస్తులు గతంలో జరిగినదంతా మర్చిపోతారు.

ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎక్కడైనా నిద్రపోతారు. బజారులోనో, స్కూల్లోనో, రోడ్డు మీదనో ఎక్కడైనా పడుకోవడం మొదలుపెడతారు. అలా చాలా రోజులు నిద్రపోతూనే ఉంటారు. ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది శాస్త్రవేత్తలు ఈ గ్రామానికి సంబంధించిన ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ నిద్ర రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఈ నిద్రను ఒక ప్రత్యేక రకమైన వ్యాధికి ఆపాదించినదని చెబుతున్నారు. కాని శాస్త్రజ్ఞులు తమ వాదనకు ఎటువంటి బలమైన సాక్ష్యాలను చూపించలేకపోతున్నారు.

కజకిస్తాన్‌లోని ఈ గ్రామానికి సమీపంలో ఒక యురేనియం గని ఉండేదని, అది ఇప్పుడు మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ గని నుంచి విషపు రేడియేషన్ వచ్చేది. దీని కారణంగా ప్రజలు ఇలాంటి వింత వ్యాధి బారిన పడ్డారని కొంతమంది వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో రేడియేషన్ లేదు. అయినప్పటికీ .. ఈ వ్యాధికి కారణం యురేనియం గనులు కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిద్ర రుగ్మతకు కారణం ఇక్కడ నీటిలోని కార్బన్ మోనాక్సైడ్ వాయువని అంటున్నారు.. అందుకనే ఇక్కడ ప్రజలు నెలల తరబడి నిద్రపోతారని పేర్కొంటున్నారు. కానీ శాస్త్రీయ కారణాలు మాత్రం సరైనవి చూపించడం లేదు. ప్రపంచంలోనే ఈ గ్రామం మిస్టరీగా మిగిలిపోయింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu