వైద్య సేవ‌ల్లో నిర్ల‌క్ష్యం వ‌ల్ల యువ‌కుడు మృతి..

Share On

కొన్ని కార్పోరేటు ఆసుప‌త్రులు వైద్యం కంటే ఎక్కువగా దోచుకోవ‌డ‌మే మామూలైపోయింది. వైద్య చికిత్స‌లో నిర్ల‌క్ష్య వ‌ల్ల ఒక యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.. అందుకు కార‌ణ‌మైన విశాఖ‌లోని క్వీన్స్‌ ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం, ముగ్గురు వైద్యులు రూ.40 లక్షలను పరిహారం కింద మృతుడి కుటుంబసభ్యులకు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెల్లడించింది. విశాఖకు చెందిన శీలా తులసీరామ్‌ (26) అనే యువకుడు 2013 అక్టోబరు 8న కడుపు నొప్పితో క్వీన్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. వైద్యులు 24 గంటలనొప్పితో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్స చేయాలంటూ అదేరోజు రాత్రి 9 గంటలకు శస్త్రచికిత్స చేశారు. తర్వాత యువకుడు అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. ఐసీయూలో ఉంచిన తులసీరాం పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. కేసు రికార్డులు చూపించేందుకూ నిరాకరించారు.

చివరికి తులసీరాం కోమాలోనికి వెళ్లారని వైద్యులు వెల్లడించారు. అదేనెల 12న యువకుడు ప్రాణాలు విడిచాడు. తులసీరాంకు ఇతరఅనారోగ్య సమస్యలు లేవని, ఎలా చనిపోతాడని బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు వినియోగదారుల కమిషన్‌ను 2015లో ఆశ్రయించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడిచారని, ఆసుపత్రి యజమాన్యం, చికిత్స అందించిన వైద్యుల నుంచి రూ.99,99,000 పరిహారం కింద ఇప్పించాలని కోరారు. ఘటనకు బాధ్యులుగా క్వీన్స్‌ ఎన్నారై ఆసుపత్రి, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ టీఎస్‌ ప్రసాద్‌, మత్తుమందు వైద్యులు డాక్టర్‌ తనూజ రాజ్యలక్ష్మిదేవి, డాక్టర్‌ రవిచంద్రహాస్‌లను పేర్కొన్నారు. కమిషన్‌ జారీచేసిన తీర్పులో రికార్డుల్లో చికిత్స వివరాలు నమోదు చేయలేదన్న విషయాన్ని వైద్యురాలు తనూజ అంగీకరించారని పేర్కొంది. వైద్యసేవల్లో లోపం కారణంగా తులసీరాం మరణించినట్లు స్పష్టం చేసింది.

ఈ కేసుపై విచారణ జరిపిన ఏపీ వైద్య మండలి కూడా మెడికల్‌ రిజిస్టర్‌ నుంచి డాక్టర్‌ తనూజ పేరును 6 నెలలపాటు తొలగించింది.మృతుడి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మానవ హక్కుల కమిషన్‌ ద్వారా కేజీహెచ్‌ వైద్యుల బృందం ఈ ఘటనపై విచారణ జరిపి, వైద్య సేవల్లో యాజమాన్యం లోపం, మత్తుమందు వైద్యుల నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. వీటిని కూడా కమిషన్‌ పరిగణనలోనికి తీసుకుంది. పరిహారంగా రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu