ముందడుగు సర్వేలో టిఆర్ఎస్ ముందంజ..

Share On

సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న ముందడుగు పౌండేషన్ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ముందడుగు పౌండేషన్ సర్వే నిర్వహించారు. అక్కడ ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు అదే ముందడుగు పౌండేషన్ తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో 20 రోజులు నియోజకవర్గంలోని పలు మండలాలలో, గ్రామాలలో సర్వే నిర్వహించారు. మూడు రకాలుగా నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది టిఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపారని పౌండేషన్ అర్గనైజర్ రాజేంద్ర తెలిపారు. ఐదు బృందాలతో వివిధ రకాల సర్వే చేపించామన్నారు. వాటి వివరాలను వెల్లడించారు. 

*చౌటప్పల్ మండలం*

చౌటప్పల్ మండలంతో పాటు ఐదు గ్రామాల్లో 570 మందిని సర్వే చేయడం జరిగింది..
చౌటప్పల్ నగరంలో చదువుకున్న వారిలో కాస్త బిజెపి హవా కనిపించినా, గ్రామాల్లో మాత్రం టిఆర్ఎస్ అధిపత్యం ఉంది. 

చౌటుప్పల్ మాత్రం మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవస్థానంలో బిజెపి, మూడవ స్థానంలో కాంగ్రెస్ 

*సంస్థా నారాయణపూర్ మండలం*

సంస్థా నారాయణపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న మూడు గ్రామాల్లో కలిపి 480 మందిమి సర్వే చేశాం
నారాయణపూర్ మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవ స్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బిజెపి.

*మునుగోడు మండలం*

మునుగోడు మండలంతో మూడు మూడు గ్రామాల్లో 430మందిని కలవడం జరిగింది. 
మునుగోడు మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవస్థానంలో బిజెపి, మూడవ స్థానంలో కాంగ్రెస్

*చండూర్ మండలం*

చండూర్ మండలంతో పాటు మూడు గ్రామాలలో 370మందిని కలవడం జరిగింది. 
చండూర్ మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవ స్థానంలో బిజెపి, మూడవ స్థానంలో కాంగ్రెస్

*నాంపల్లి మండలం*

నాంపల్లి మండలంతో పాటు రెండు గ్రామాలలోని 310మందిని కలవడం జరిగింది. 
నాంపల్లి మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవ స్థానంలో బిజెపి, మూడవ స్థానంలో కాంగ్రెస్..

*మర్రిగూడెం మండలం*

మర్రిగూడెం మండలంతో పాటు రెండు గ్రామాలలో 320 మందిని కలవడం జరిగింది.. 
మర్రిగూడెం మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవస్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బిజెపి..

*గట్టుప్పల్ మండలం*

గట్టుప్పల్ మండలంతో పాటు రెండు గ్రామాలలో 310 మందిని సర్వే చేయడం జరిగింది. 

గట్టుప్పల్ మండలంలో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవ స్థానంలో బిజెపి, మూడవ స్థానంలో కాంగ్రెస్

మునుగోడు నియోజకవర్గంలో 25% మంది తాము ఏ పార్టీ కాదని చెపుతున్నారు..
రైతు బంధు రావడంతో రైతులు, ఫించన్లు రావడంతో వృద్దులు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు..
యువతలో టిఆర్ఎస్ పార్టీపై కాస్త వ్యతిరేకత ఉంది..
మహిళలు మొదట స్థానం టిఆర్ఎస్, రెండవ స్థానం కాంగ్రెస్, మూడవ స్థానం బిజెపి వైపు ఆసక్తి చూపారు..

మునుగోడు నియోజకవర్గం మొత్తంగా

టిఆర్ఎస్ మొదటి స్థానంలోబిజెపి రెండవ స్థానంలోకాంగ్రెస్ మూడవ స్థానంలో ఉన్నట్లు తమ సర్వే ద్వారా తెలింది.

5 to 7 శాతం ఓట్లతో మునుగోడులో టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu