
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్ వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి.. దేశంలో పారిశ్రామికవేత్తలు తీసుకొని ఎగనామం పెట్టిన అప్పులు ఎన్ని ఉన్నాయో తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి భారత రిజర్వ్ బ్యాంకుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. అందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చిన సమాచారాన్ని బయటపెట్టారు.
ఒక సామాన్యుడు లేదా ఒక రైతు దేశంలోని ఏ బ్యాంకు నుంచి ఐనా తన అవసరం నిమిత్తం రుణం కోసం బ్యాంకుల చుట్టు తిరగగా, తిరగగా ఎంతో కొంత ఇస్తారు. రైతులకు, సామాన్యులు తీసుకున్న కొద్దిగొప్పో రుణాన్ని సకాలంలో చెల్లించడం లేదని వారి ఆస్తులను బ్యాంకులు వేలం వేసి నడిబజారులో నిలబెడుతారు. అదే ఉన్నవాళ్లు తీసుకొని ఎగనామం పెడితే పట్టించుకునే నాధుడే ఉండరు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా తన బ్యాంకు నుంచి కోట్లాదిమందికి రుణాలు ఇస్తూ ఉంటుంది. బ్యాంకు ఇచ్చిన రుణాలలో ప్రస్తుతానికి.. 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయలేకపోతున్నామని స్పష్టం చేసింది.
వాటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం non performed asserts (NPA) కింద అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06, 804 వేల కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని ఇండియా భారతీయ స్టేట్ బ్యాంక్ పిఐఓ ములుకుంట్ల శ్రీనివాస్ రావు తెలిపారు.