
స్వంత కోడలిని లైంగికంగా వేధిస్తున్న మామను, కోడలి తల్లిదండ్రులు పథకం ప్రకారం హత్య చేసారు.. పెళ్లయి ఐదేళ్లయినా నువ్వు సంతానవతివి కాలేదంటూ, కుదిరినప్పుడల్లా ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఆయన వేధింపులను తట్టుకోలేక ఆ గృహిణి సిగ్గువిడిచి తన తల్లిదండ్రుల వద్ద కష్టం చెప్పుకొంది. తమ్మేగౌడకు మంచిగా చెబితే వినడని గుర్తించిన ఆ గృహిణి తల్లిదండ్రులు అతన్ని హత్య చేయించేందుకు పథకాన్ని రూపొందించారు. హాసన జిల్లా హొళెనరసీపుర ఠాణా పరిధిలోని తమ ఇంటికి వియ్యంకుడిని నవంబరు 13న పిలిపించి మద్యం, మాంసంతో విందు ఇచ్చారు.
అతను మత్తులోకి జారుకున్న తర్వాత తాము ముందుగా రూ.50 వేలు కిరాయి ఇచ్చిన యువకులను ఇంటికి పిలిపించుకున్నారు. ఇనుప రాడ్తో అతనిపై దాడి చేసి కడతేర్చారు. మృతదేహాన్ని ఊరవతల పడేశారు. మృతుని మూడో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ గృహిణి తల్లిదండ్రులు మైలారగౌడ, తాయమ్మను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుపారీ హంతకుల కోసం హొళెనరసీపుర ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.