
అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీ ఉండగా ఒక మహిళా మధ్యలో దూరి పెళ్లి నగలతో ఉదయించింది.. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ భారీ దొంగతనం జరిగింది. నగరానికి చెందిన ఒక కుటుంబం తమ కూమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. వివాహ వేదికైన ఫంక్షన్ హాల్‌కు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. బంధువులు, స్నేహితులను ఆ కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరించారు. అతిథులతో ఫంక్షన్ హాల్ పూర్తిగా నిండిపోయింది. సుముహూర్తం దగ్గర పడుతుండటంతో రీఫ్రెష్ అవ్వడానికి వారు తమ తమ గదులకు వెళ్లారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బు కనిపించకపోవడంతో షాక్ అయ్యారు.
సీసీటీవీల్లో చూడగా.. ఒక మహిళ తన దుపట్టాలో నగలు, డబ్బు పెట్టుకుని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్తున్నట్లు గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు ఎత్తుకెళ్లిన మహిళ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. రాంచీలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారికాదని అధికారులు వెల్లడించారు.