Share On

ఉదయం నిద్రలేస్తే కార్మికుల జపం చేసే కమ్యూనిస్టులు వారి సంస్థలు అయిన ప్రజాశక్తి,నవతెలంగాణ సంస్థల్లో లాక్ డౌన్ కాలంలో వారి సిబ్బంది, జర్నలిస్టులు ముఖ్యంగా ప్రింటింగు విభాగాల్లో వారికి కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణం. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం వేతనాలు కత్తిరించవద్దు అని ఆజ్ఞలు ఇచ్చింది.. సుప్రీం కోర్టు కూడా ఉద్యోగుల పక్షాన నిలబడింది. పై సంస్థల్లో మాత్రం వారం రోజులు, పది రోజులు , 15 రోజుల వేతనాలు అంటూ వివిధ రకాల పద్ధతులు పెట్టి జీతాల్లో కోతలు పెడుతున్నారు. పేరుకే కమ్యూనిస్టులు, పెట్టుబడిదారులే వీరి నుంచి చాలా నేర్చుకోవాలి.ఎందుకంటే మార్క్స్ క్యాపిటల్ చదివి దోపిడీ ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది వీరికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఆఫీసులో బాయ్ , ప్రింటింగ్ లో పనిచేసే కార్మికులకు ఏప్రిల్ నెలలో రెండు వేల లోపు జీతం వచ్చింది. ఇది కనీసం ఇంటి అద్దెకు కూడా సరిపోదు. ఈ కష్టజీవులు బతికేదెలా?
ఈ రెండు వేలు కూడా ఉద్యోగానికి హాజరు అయితేనే ఇచ్చారు. లేకపోతే వారికి వచ్చే క్యాజువల్ లీవ్ , ఎర్నడ్ లీవ్ కత్తిరించి వేతనాలు ఇచ్చారు. బోర్డు స్థాయి ఉద్యోగులు మాత్రం కనీసం 12 వేలకు తగ్గకుండా మేనేజ్మెంట్ తో అడ్జస్ట్ అయ్యి వేతనాలు పొందినారు. ప్రజాశక్తి లో 30 శాతం కత్తిరించి 70 శాతం జీతాలు ఇచ్చారు.

ఎవరివి త్యాగాలు …పార్టీ సభ్యులు , సానుభూతిపరులు క్రింద గ్రేడ్ లో పనిచేసే వారు ఉన్నారు. వారు మనుషులు కాదా.. వాస్తవంగా అత్యధిక మంది తక్కువ వేతనాలు తీసుకునే వారే ఈ రోజు పార్టీ కోసం త్యాగం చేస్తున్నారు.

ప్రజాశక్తి నుండి టెన్ టీవీ ఏర్పాటు చేసినప్పుడు 22 కోట్ల
రూపాయలు పెట్టుబడిగా పెట్టారు . టెన్ టీవీ అమ్మిన తర్వాత వచ్చిన నిధుల నుండి పార్టీ పత్రికలు ప్రజాశక్తి, నవ తెలంగాణకు తిరిగి డబ్బులు ఎందుకు చెల్లించలేదు ?

నేడు ఆ డబ్బులు వుంటే మూడు నెలల వేతనాలు ఇవ్వడానికి సరిపోయేది కదా!
అంతేకాదు పత్రికలను కాపాడుకోవాలని చిత్తశుద్ధి మీలో ఉంటే వేల కోట్ల రూపాయల విలువ చేసే పార్టీ ఆస్తులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి కదా. వాటిలో ఏ ఒక్కటైనా కనీసం తనఖా పెట్టిన ఉద్యోగుల్ని తొలగించకుండా యధావిధిగా కొనసాగించ వచ్చు

అయితే… ఈ నిధులు ఏమ‌య్యాయి…ప్ర‌స్తుతం ఎవ‌రి చ‌క్ర‌బంధంలో పార్టీ ఇలా చేస్తోందంటే…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఘవులు తన పట్టు బిగించారు.. రాష్ట్రం విడిపోగానే అప్పటికే ఢిల్లీ లో ఉన్నటువంటి వంకాయలపాటి శ్రీనివాసరావును తన  మనిషిగా విజయవాడ కి పంపారు.. తన సామాజిక వ‌ర్గం వారిని భవిష్యత్తులో పార్టీ కార్యదర్శిగా కూడా పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారాయ‌న‌. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర సిపిఎం కు షాడో రాష్ట్ర కార్యదర్శిగా  నడిపించేది అంతా  శ్రీనివాసరావే.. 

అటు పార్టీ పైన , ఇటు పత్రికలపైన రాఘవులు దే హావా. ప్రజాశక్తి లో ఎలాగో ఆయనదే నడుస్తుంది. ఆయన అదేశాలతోనే ఇటీవల ప్రజాశక్తి లో 250మంది ఉద్యోగులను తొలగించారు. ఈ నిర్ణయం కేవలం పోలిట్బ్యూరో సభ్యులు గా ఉన్నటువంటి బి.వి.రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి ఎడిటర్ ఎంవిఎస్ శర్మ…. ఈ ముగ్గురు 250 మంది జీవితాలతో చెలగాటమాడారు..ప్రస్తుతం పార్టీలో ,ప్రజాశక్తి లో తిరుగుబాటు జెండా ఎత్తగానే ఆ ఉద్యోగులను బెంచ్ పైన పెట్టారు..రేపో,మాపో వారిని ఇంటికి పంపటం ఖాయం..

ఇక తెలంగాణలో నవ తెలంగాణ పత్రిక పైన రాఘవులు మరింత పట్టు బిగించారు.
పేరుకే తెలంగాణ పత్రిక పెత్తనమంతా అంద్రోళ్ళదే. ప్రజాశక్తి కి గతంలో చీఫ్ జనరల్ మేనేజర్ గా పని చేసినటువంటి వ్యక్తి రాఘవులు అనుంగ శిష్యుడు నవ తెలంగాణ పత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ గా నియమించారు. ఇప్పటికే ఎడిటర్ వీరయ్య రాఘవులు మాట జవదాటి పోడు. అందుకే ఇటీవల పత్రికలో పెద్ద కుదుపు వచ్చి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. దీనికి కారణం వీరయ్య ఇష్టానుసారం నియామకాలు జరపడం , భారీ ఎత్తున జీతాలు ఇవ్వడం కారణం. రాష్ట్రా పార్టీ వైపు నుండి వీరయ్యదే బాధ్యత. కానీ రాఘవులు అండదండలతో ఆయన మీద ఏ మాత్రం చర్యలు లేవు. తెలంగాణ లో సామాజిక న్యాయం పేరుతో గప్పాలు కొట్టిన రాష్ట్ర కమిటీలో ఒక్కడు కూడా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనికి వచ్చే వారు లేరా?. దీన్ని ప్రశ్నించేందుకు తెలంగాణ పార్టీలో ధైర్యం ఉన్న పార్టీ నాయకులు లేరా? లేకపోతే ప్రశ్నిస్తే వారి పదవులకు ఎసరు వస్తుందని భయమా?
ప్రభుత్వ వ్యతిరేక సంఘాలుగా ముద్రలు వేసుకొని, మా డిమాండ్లు నెరవేర్చాలని నిత్యం ప్రశ్నించే సంఘాల నేతలు ఈ రెండు సంస్థలు లోనే ఉన్నారు. వీరి గొంతులు మూగబోయినాయా?

జర్నలిస్టుల కోసం, మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పక్షాన ఒక వినతిపత్రం ఐన ఇచ్చారా?. ప్రశ్నించని వాళ్లకు సంఘం పెట్టుకొనే అర్హత ఉందా?

ఒక పత్రిక వంద మంది కార్యకర్తలతో సమానం అని మార్క్సిస్టు మహోపాధ్యాయ లెనిన్ అన్నారు…
కానీ ఈ కమ్యూనిస్టులు పత్రిక పెట్టింది లాభాల కోసమా..పార్టీ ప్రయోజనాల కోసమా ?

ప్రజాశక్తి, నవ తెలంగాణ ఏర్పాటు నుండి గత అనేక సంవత్సరాలుగా మండల స్థాయిలో పని చేస్తున్నటువంటి విలేకరులు తమ తమ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లు చేయనిది ఎవరిని కొనసాగించేవారు కాదు.

కనీసం సంవత్సరానికి లక్ష నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేయాలి. లేకపోతే విలేకరిగా కొనసాగడానికి అర్హత ఉండదు.

ఇక జిల్లా కేంద్రాలలో రాజధానిలో పని చేసినటువంటి విలేకరులపై ఏ విధమైనటువంటి టార్గెట్లు ఉంటాయో ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

మరోవైపు ఆఫీసులో సబ్ ఎడిటర్లు…. డెస్క్ ఇంచార్జ్ తమ పని చేసేదానికి సంస్థ ఇచ్చే వేతనానికి పొంతన ఉండదు.

ఇచ్చే ది అరకొర వేతనాలు… నిన్నటిదాకా ఈ సంస్థ నాది ఇందులో యజమానులు ప్రజలే
అని పై స్థాయిలో ఉన్నటువంటి యాజమాన్యం రోజు చెప్పే సొల్లు పురాణాన్ని విలేకరులు..ప్ర‌స్తుతం ఈసడించుకుంటున్నారు.

సాహితీ సంస్థ గా ఉన్నటువంటి పత్రిక ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ గా మార్చిన తర్వాత లాభం తప్ప మరొకటి ఆలోచనలేని సంస్థ గా మారిపోయింది.

కమ్యూనిస్టు పత్రికలు ప్రజల పక్షాన వున్నవా?? ప్రతి అక్షరం కార్మికుల పక్షమే, ప్రజల పక్షమే అని సగర్వంగా పని చేసిన సిబ్బందికి చివరికి వారే రోడ్డున పడ తారని ఊహించలేదు.

పార్టీ లో శాఖ సభ్యుల నుండి అఖిల భారత ప్రధాన కార్యదర్శి వరకు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అని చెప్పుకునే కమ్యూనిస్టులు , ఏ వేదికలో చర్చించకుండా నియంతృత్వంగా ఉన్నత స్థానాల్లో ఉండే యజమాని తాను అనుకున్నది నిర్ణయంగా వందల మంది ఉద్యోగాల్లో తొలగించడం అంటే ఇది ఎలాంటి నియంతృత్వం ఆలోచించాలి.

వీరికి దయ, కరుణ, జాలి అనే పదానికి అర్థాలే ఉండవు.

ఎందుకంటే వీరి ఆలోచన ధోరణిలోనే నియంతృత్వం ఉంటది.

కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వం మీ పార్టీ పత్రికల్లో జరిగినటువంటి అన్యాయంపై బాధ్యులని శిక్షించి, పత్రికను, జర్నలిస్టులను,సిబ్బందిని కాపాడాలని మీ శ్రేయోభిలాషులు, ప్రగతి శీల శక్తులు కోరుకుంటున్నారు.. పత్రికలను ఢిల్లీ ఆదేశాల ప్రకారం కాకుండా తెలుగు ప్రజల కోసం , కార్మికుల కోసం..మీరు చెప్పే స‌మ‌స‌మాజం కోసం నిలబడాలని..నిల‌బెట్టాల‌ని కోరుకుంటున్నారు.


Share On
2 thoughts on “అయ్యా… నిధులు ఎక్క‌డికి పోయా! కార్మిక పార్టీ పత్రికా జ‌ర్న‌లిస్టుల క‌డుపు కొడుతున్న ఎర్ర‌పార్టీ నేత‌లు!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!