
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు. ఆ సమయంలో పాలంపేట సర్పంచ్ డోలి రజితను ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి పిలువలేదు.. అభివృద్ధి పనుల శిలాఫలకంపై ఎక్కడ సర్పంచ్ పేరు పెట్టలేదు. యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థకు సర్పంచ్ చేసిన ఫిర్యాదు మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసారు. యూత్ ఫర్ యాంటీకరప్షన్ ఫిర్యాదును భారత రాష్ట్రపతి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విచారణ చేయమని ఆదేశించారు..
భారత రాష్ట్రపతి కార్యాలయం పంపిన సర్పంచ్ ప్రోటోకాల్ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం విచారణ చేసారు.. ఎవరిపై చర్యలు తీసుకున్నారు.. రామప్పలోని శిలాఫలకాలపై గ్రామ సర్పంచ్ పేరు పెట్టించాలని యూత్ ఫర్ యాంటీకరప్షన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేసినట్లు యూత్ ఫర్ యాంటీకరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, ములుగు జిల్లా అధ్యక్షుడు పంబిడి శ్రీధర్ రావు తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని బట్టి ముందడుగు వేస్తామని వారు తెలిపారు..