
ఒక వృధ్ద మహిళ 65ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ అందరిని ఆశ్యర్యపరుస్తుంది. ఆ వ్యాపారంలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తోంది. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్‌బీన్ దల్‌సంభాయ్ చౌదరి. ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది.
అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్‌బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.