ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

Share On

ఫ్రీ వెడ్డింగ్ షూట్ వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఫోటోగ్రాఫర్స్ మరణించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.

కారు డ్రైవర్‌ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తున్నది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu