
తెలంగాణ రాష్ట్రంలో 75సంవత్సరాల భారత స్వతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు.. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో జాతీయజెండాలను ఎగరవేశారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.
తెలంగాణ ప్రభుత్వం 75సంవత్సరాల జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి సమాచారహక్కు చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తుకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చుల వివరాలను ఇచ్చింది. దానికి సంబంధించిన ఖర్చుల వివరాలను యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి విడుదల చేశారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా వారోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.37.95కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని పౌర సమాచార అధికారి ఆర్. నాగజ్యోతి పూర్తి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గాంధీ చిత్రాన్ని పలు సినిమాలలో ప్రదర్శించడానికి రూ.25.09 లక్షలు ఖర్చు చేసినట్లు వారు సమాచారం ఇచ్చారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం తెలిపింది..