
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి ఆయన చిత్ర పటానికి పూలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జననం తప్ప మరణం లేని మహనీయుడు నేతాజీ అని, ఆయన సేవలు, వీరత్వం నేటి యువతరానికి ఆదర్శం అన్నారు. నేతాజీ అనేక పోరాటాలను చేస్తూ యువతరానికి మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. నేతాజీ జీవితం యువతరానికి మేలుకొలుపు అని, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడిచి, ఆయన ఆశయాలను నేరవేర్చాలని అన్నారు. మహనీయుల అడుగుజాడల్లో నేటి యువతరం నడిచినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ మహానీయుల అడుగుజాడల్లోనే ముందుకు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కానుగంటి రాజు, మూడావత్ రమేశ్ నాయక్, కొన్నె దేవేందర్, కొమటి రమేశ్ బాబు, బత్తిని రాజేష్, నాగేంద్ర, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.