
తొందరగా పని చెయ్యాలంటూ అసహనానికి గురైన తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్ ఆ కోపంలో ఆయన తన పార్టీ కార్యకర్తలపైనే రాయి రువ్వారు. ఈ సంఘటన తిరువల్లూరులో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. తిరువల్లూరులో సీఎం స్టాలిన్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. ఆ సభ ఏర్పాట్లను మంత్రి నాసర్ చూసుకుంటున్నారు. అయితే వేదిక వద్దకు చైర్లు తీసుకురావడంలో ఆలస్యం జరిగింది. దీంతో మంత్రి నాసర్.. కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టించారు. తొందరగా చైర్లు తేవాలంటూ హుకుం జారీ చేశారు. ఇక అదే ఆవేశంలో ఆయన అక్కడ ఉన్న రాయిని తీసి కార్యకర్తపై విసిరేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారికి స్మృతికి చిహ్నంగా డీఎంకే పార్టీ వీర వనక్కమ్ నాల్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది.