
కర్నూల్ పట్టణంలోని ఏసీబీ ఆఫీసులో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండరును డీస్పీ శివ నారాయణస్వామి ఆవిష్కరించారు. యాక్ రాయలసీమ అడ్వైజర్ వేణుగోపాల్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం డిఎస్పి మాట్లాడుతూ యాక్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి యువతకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఎక్కడైనా అవినీతి అధికారులు ఉంటే మాకు సమాచారం ఇవ్వవలసిందిగా తెలియజేశారు. అవినీతి నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ బి నారాయణ, కర్నూలు జిల్లా సెక్రెటరీ పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.