
ఒక కుటుంబం మటన్ వండుకొని తిన్నారు.. కాసేపటికే మాంసాహారం తిన్న ఆ కుటుంబంలోని 9 మంది అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. అరకులోయ మండలం గన్నేల పంచాయతీ తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్ వండుకుని తిన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మీనాక్షి (5) మృతి చెందింది. మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విశాఖపట్నం తరలిస్తామని వైద్యులు తెలిపారు.