
ప్రభుత్వాలు చేసే పనులకు, పెట్టే ఖర్చులకు ఒక్కొసారి అస్సలు పొంతనే ఉండదు. ఇష్టానుసారంగా నిధులు మంజూరు చేస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూనే ఉంటారు.
గత సంవత్సరం చివరిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. అందులో భాగంగా తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ నగరవ్యాప్తంగా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కాని ఆ మట్టి విగ్రహలు ఎక్కడ పంపిణీ చేశారో, ఎవరికి ఇచ్చారో, ఎన్ని తయారు చేశారో మాత్రం ఎవ్వరికి తెలియదు. మట్టివిగ్రహల పంపిణీ, ఖర్చులు వివరాలను తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ జిహెచ్ఎంసీకి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది.
మట్టి వినాయక విగ్రహల పంపిణీ, ఖర్చులపై జిహెచ్ఎంసీ ఇచ్చిన వివరాలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి బయటపెట్టారు.
జిహెచ్ఎంసీ పరిధిలో వినాయక చవితి సంధర్బంగా నగరవ్యాప్తంగా ఎన్ని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అందుకు ఎంత ఖర్చు చేశారు వాటి వివరాలను తెలపండి అని ప్రశ్నించగా జిహెచ్ఎంసీ పరిధిలో వినాయక చవితి సంధర్బంగా మొత్తం 8అంగుళాల విగ్రహలు 2.60.000 కాగా, ఒక్క అడుగు విగ్రహలు 30000 వేలు, 1.5 అడుగుల విగ్రహలు 10000 పంపిణీ చేయబడ్డాయి. 2022 వినాయక చవితి పండుగ కోసం జిహెచ్ఎంసీకి గణేశ్ విగ్రహాల సరఫరా మరియు డెలివరీ కోసం మొత్తం 1,54,24,000 ఖర్చు చేయబడిందని తెలిపారు.
జిహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఎంత ఖర్చు చేశారో తెలపాలని అడగగా, నిమజ్జనాల ఖర్చు తమ సెక్షన్ పరిధిలోకి రాదని జిహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సమాధానం ఇచ్చారని సంస్థ పౌండర్ రాజేంద్ర తెలిపారు.