
సామాన్యుడి ఆయుధంగా పేరుగాంచిన సమాచార హక్కు చట్టం అంటే అందరికి నిర్లక్ష్యం అవుతోంది. ప్రభుత్వ అధికారులు సహచట్టంపై అవగాహన లోపమో, మరే కారణమో తెలియదు కాని సహచట్టంపై ప్రశ్నిస్తే సరియైన సమయంలో సమాచారం ఇచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు.
అలాంటిది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి సమాచారహక్కు చట్టం నుంచి కొన్ని అంశాలపై దరఖాస్తు చేయగా కనీస స్పందనలేదు. మొదటి అప్పీలు చేసిన కూడా సమాచారం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని పర్యటనలు చేశారు. అందుకు ఎంత ఖర్చు చేశారు. తమిళ సై ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఏట్ హౌం కార్యక్రమాలు ఎన్ని సార్లు నిర్వహించారు. అందుకు ఎంత ఖర్చు చేశారు. ఆ ఖర్చుల వివరాలు తెలపండి.
తమిళ సై నిర్వహించిన మహిళ దర్బార్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు. ఇప్పటివరకు ఎన్ని వారాలు నిర్వహించారు. అందులో ఎంతమంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులపై మీరు ఏలాంటి చర్యలు తీసుకున్నారు. మహిళ దర్బార్ ఇంక కొనసాగుతుందా, లేదా ఆపివేశారా అందుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలని రాజ్ భవన్ కార్యాలయానికి దరఖాస్తు చేయడమే కాకుండా మొదటి అప్పీలు చేసిన స్పందన లేదని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. బాధ్యత కలిగిన కార్యాలయ పిఐవో అధికారులు సమాచారం ఇవ్వకపోవడానికి కారణాలెంటో తెలపాలన్నారు.