
దేశంలో వివిధ కేసులలో జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు లక్షల్లో ఉంటారు. వీరు దేశంలో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారా, లేదా తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఒక వేళ ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకొకుంటే వారికి ఎందుకు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వట్లేదో తెలపాలని ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకొవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అడగగా మీరు అడిగిన సమాచారం తమ కార్యాలయంలో అందుబాటులో లేని సమాచారం అడిగారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండర్ సెక్రటరీ పిఐఓ అభిషేక్ తివారి సమాచారం ఇచ్చారు. ఇంకా దీనిపై మీరు పూర్తి సమాచారం కావాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొదటి అప్పీలేట్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ దరఖాస్తు చేయాలని సూచించారు.