పెళ్లి జరిగిన పదిహేను రోజులకే వేధింపులు..

Share On

పెళ్లి జరిగిన మొదటి రోజు నుంచే ఆ పెళ్లి కూతురికి అడుగడునా వేధింపులే ఎదురయ్యాయి. స్వర్గంలా ఉంటుందనుకున్న అత్తారిల్లు.. నరకాన్ని తలపించటంతో.. ఆ బాధలు తట్టుకోలేక తనువు చాలించింది ఆ నవవధువు. దీంతో.. ఆ పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. చింతల్ బాపునగర్‌కు చెందిన నవవధువు నిషితకు 15 రోజుల క్రితం.. మేడ్చల్ మండలం డబీర్‌పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో వివాహం జరిగింది. అయితే.. పెళ్లి అయిన తర్వాత అత్తారింటికి వెళ్లిన నిషిత.. 15 రోజుల తర్వాత పుట్టినింటికి వచ్చింది. అయితే.. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. నిషిత మాత్రం పుట్టింట్లో నిన్న రాత్రి చున్నితో ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తమ అమ్మాయి.. తిరిగి పుట్టింటికి వచ్చిన రోజే విగతజీవిగా మారటాన్ని చూసి.. ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.

పెళ్లి జరిగిన 15 రోజులకే నవవధువు ఇలా ఆత్మహత్య చేసుకోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవవధువు ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని భావిస్తున్నారు. వరుడి వేధింపులు తట్టుకోలేకనే ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. నిషిత తండ్రి నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu