
సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌నగర్.
ఉమా సోదరుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12 వ ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈ నెలలో విధుల్లో చేరాడు. నేడు వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో కూతురు ఉమా 3వ ర్యాంకు సాధించడం పట్ల ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆయన భార్య శ్రీదేవి సంతోషం వ్యక్తం చేశారు. ఉమా హారతికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.