
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంక్ సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తుంటుంది. దీని ప్రకారం జూన్ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక ఇందులో శని, ఆదివారాలు కూడా ఉంటాయి. ఇంకా ప్రాంతాలను బట్టి.. సెలవులు మారుతుంటాయి.
మొత్తం 12 రోజుల్లో ఆరు రోజులు శని, ఆదివారాలు ఉన్నాయి. మిగతా 6 రోజులు.. పండగలు, వార్షికోత్సవాలు వంటివి ఉన్నాయి. ఇక ఏయే రాష్ట్రాల్లో ఏయే పండగల సందర్భంగా బ్యాంకులు పనిచేయవో తెలుసుకుందాం.
జూన్ 4: ఆదివారం నేపథ్యంలో ఈ రోజున బ్యాంకులు పనిచేయవు.
జూన్ 10: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్
జూన్ 11: ఆదివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
జూన్ 15: రాజ సంక్రాంతి నేపథ్యంలో.. ఈ రోజున మిజోరం, ఒడిశాలో బ్యాంకులు బంద్.
జూన్ 20: రథ్ యాత్ర సందర్భంగా ఒడిశాలో బ్యాంకులు బంద్
జూన్ 24: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు
జూన్ 25: ఆదివారం
జూన్ 26: ఖర్చి పూజ, త్రిపురలో బ్యాంకులకు సెలవు
జూన్ 28: ఈద్ ఉల్ అఝా, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, కేరళలో బ్యాంకులకు సెలవుజూన్ 30: రీమా ఈద్ ఉల్ అఝా
బ్యాంకులు ఈ రోజుల్లో మూతపడినా కూడా.. ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. ఏటీఎంలు కూడా పనిచేస్తాయి. డబ్బులు విత్‌డ్రా చేసేందుకు, డిపాజిట్ చేసేందుకు ఏటీఎం లు పనిచేస్తాయి. ఇక తప్పనిసరి పని అయితే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.