తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల..

Share On

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాల‌ను హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్‌ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/తోపాటు www.ntnews.comలో చూడవచ్చు. అడ్మిషన్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి చెప్పారు.

ఎంసెట్‌ పరీక్షలను ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేసుకోగా 1,95,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలకు 1,15,361 మంది అప్లయ్‌ చేసుకోగా 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలకోసం https://www.ntnews.com/telangana-eamcet-2023-results క్లిక్‌ చేయండి

ఇంజినీరింగ్‌లో
స‌న‌పాల అనిరుధ్‌(విశాఖ‌ప‌ట్ట‌ణం) తొలి ర్యాంకు సాధించ‌గా, మ‌ణింధ‌ర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వ‌రుణ్‌(నందిగామ‌) మూడో ర్యాంకు, అభిణిత్ మ‌జేటి(హైద‌రాబాద్) నాలుగో ర్యాంకు, ప్ర‌మోద్ కుమార్ రెడ్డి(తాడిప‌త్రి) ఐదో ర్యాంకు, మార‌ద‌న ధీర‌జ్(విశాఖ‌ప‌ట్ట‌ణం) ఆరో ర్యాంకు, వ‌డ్డే శాన్విత‌(న‌ల్ల‌గొండ‌) ఏడో ర్యాంకు, బోయిన సంజ‌న‌(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్ర‌న‌హం రెడ్డి(నంద్యాల‌) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్ర‌ణ‌తి శ్రీజ‌(విజ‌య‌న‌గ‌రం) ప‌దో ర్యాంకు సాధించారు.

అగ్రిక‌ల్చ‌ర్, మెడిసిన్ టాప్ టెన్ ర్యాంక‌ర్లు వీరే..
తొలి ర్యాంకు – బూరుగుప‌ల్లి స‌త్య రాజ జ‌శ్వంత్(ఈస్ట్ గోదావరి)
రెండో ర్యాంకు – నశిక వెంక‌ట తేజ‌(చీరాల‌)
మూడో ర్యాంకు – స‌ఫ‌ల్ ల‌క్ష్మీ ప‌సుపులేటి(రంగారెడ్డి)
నాలుగో ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు)
ఐదో ర్యాంకు – బోర వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(శ్రీకాకుళం)
ఆరో ర్యాంకు – దేవ‌గుడి గురు శ‌శిధ‌ర్ రెడ్డి(హైద‌రాబాద్)
ఏడో ర్యాంకు – వంగీపురం హ‌ర్షిల్ సాయి(నెల్లూరు)
ఎనిమిదో ర్యాంకు – ద‌ద్ద‌నాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
తొమ్మిదో ర్యాంకు – గంధ‌మ‌నేని గిరి వ‌ర్షిత‌(అనంత‌పురం)
ప‌దో ర్యాంకు – కోళ్ల‌బ‌త్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైద‌రాబాద్)


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu