
రవీందర్ అనే సీరియల్ కిల్లర్ సుమారు 30మందికి పైగా చిన్నారులను చంపాడు. అతనికి ఇవాళ ఢిల్లీ హైకోర్టు జీవితకాల శిక్షను విధించింది. మైనర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, మర్డర్ చేసేవాడని అతనిపై కేసులు ఉన్నాయి. 2008 నుంచి 2015 మధ్య కాలంలో అతను సమారు 30 మంది చిన్నారులను కిడ్నాప్-మర్డర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో ఆ నేరాలకు పాల్పడినట్లు రవీందర్ కుమార్ అంగీకరించాడు. చంపిన తర్వాత శవాలతో శృంగారం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత శనివారం ఢిల్లీ కోర్టు రవీందర్‌ను దోషిగా తేల్చింది. ఢిల్లీలో రోజువారి లేబర్‌గా పనిచేసే రవీందర్.. డ్రగ్స్‌కు అలవాటయ్యాడు. పోర్న్ చిత్రాలను చూసేవాడు. రాత్రి పూట పిల్లల కోసం వేటాడేవాడని, 18 ఏళ్ల వయసులోనే అతను క్రూరంగా మారినట్లు పోలీసులు తెలిపారు. యూపీలోని కాస్‌గంజ్‌కు చెందిన అతను ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చాడు.
డ్రగ్స్ మత్తులో అతను రాత్రి పూట నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో పిల్లల కోసం తిరిగేవాడు. రూ.10 నోట్లు, చాక్లెట్లు ఇచ్చి పిల్లలను లోబరుచుకునేవాడు. తనను గుర్తుపడుతారేమో అన్న భయంతో అతను చాలా మంది పిల్లలను చంపినట్లు తెలుస్తోంది.