
భర్త అనుకోకుండా మరణించడంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది. అతడు లేని లోకంలో తాను బతకలేనని భావించి, ఆ వేదనను తట్టుకోలేక ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
29 సంవత్సరాల సాహితికి సంవత్సరన్నర క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. వారిద్దరూ అమెరికాలో నివాసముంటున్నారు. ఈనెల రెండున సాహితి డీడీ కాలనీలో ఉండే తన తల్లితండ్రులను చూడడటానికి ఇండియాకు వచ్చింది. 20వ తేదీన సాహితి భర్త మనోజ్ అమెరికాలో హార్ట్ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందాడు. అతడి మృతదేహం 23వ తేదీన ఇండియాకు వచ్చింది. అశ్రునయనాల మధ్య 24వ తేదీన వనస్థలిపురంలో మనోజ్ అంత్యక్రియలు జరిగాయి. అనంతరం సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లితండ్రులతో డీడీ కాలనీలోని ఇంటికి వచ్చింది. రాత్రి సాహితి, ఆమె చెల్లెలు సంజన కలిసి ఒకే రూమ్‌లో పడుకున్నారు. గురువారం ఉదయం 09:20 గంటల సమయంలో సంజన వాష్ రూమ్‌కి బయటకు వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అప్పటికే లోపల నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపలి నుంచి సమాధానం రాలేదు. అనుమానంతో తలుపు బద్దలుకొట్టి చూడగా.. సాహితి చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకుంది…సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.