
అసలు పెళ్లెందుకు చేసుకోవాలి.. పెళ్లి చేసుకొని రోజు ఒకటే మోహం చూడాలా అంటూ సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానాన్ని చెప్పారు..
అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. పెళ్లి చేసుకుని రోజు ఒకటే మొహం చూడాలి.. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలన్నది నా లక్ష్యం ..ప్రేమలేని పెళ్లికి అసలు అర్థం లేదు ..ప్రేమించకుండా కూడా పెళ్లి చేసుకోలేము.. అంటూ సంచలన విషయాన్ని చెప్పింది వరలక్ష్మి. దీంతో వరలక్ష్మి సమాధానం విన్న యాంకర్ షాక్ అయింది. అంతేకాకుండా వివాహం గురించి ఇంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు ఏంటి అని వరలక్ష్మికి చెప్తోంది .అందుకు సమాధానంగా వరలక్ష్మి మాట్లాడుతూ ఎవరో బలవంతం మీద ఒక వ్యక్తితో పెళ్లి చేస్తే కలిసి ఉండలేము కదా అంది.
ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండాలి.. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు చేసుకుంటారని ఎవరైనా అడగగలరా.. కానీ ఆడవాళ్లకు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి.. ఆడవారు కూడా వారి కోసం వారు బ్రతకాలి కదా.. ప్రతి ఆడవారు వారి కోసం వారు బ్రతకగలరు.. సంపాదించుకోగలరు ..వాళ్లకి ఏం కావాలో వాళ్ళు చేసుకోగలరు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి.