
ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో ఏప్రిల్ నెలలో శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేశారు. ఏఏ కార్యక్రమాలకు, ఏఏ పనులకు ఎంత ఖర్చు చేశారు. వేడుకల నిర్వహణకు వచ్చిన సెలబ్రెటీలకు ఎంత పారితోషికం చెల్లించారు. ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. వాటికి సంబంధించిన నిధులు, ఖర్చుల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేయడం జరిగింది. తెలంగాణ సిఎస్ కార్యాలయం నుంచి సంబంధిత శాఖలకు దరఖాస్తు బదిలీ చేయగా ఇప్పటివరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర వారసత్వ శాఖ స్పందించారు. రామప్పలో శిల్పం, వర్ణం, కృష్ణం కార్యక్రమాలకు ఈ శాఖ నుంచి విడుదల చేయలేదు. ఇట్టి ఉత్సవాలు తమ శాఖ పరిధిలో నిర్వహించబడలేదని సమాచారం ఇచ్చారు.