
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు ఎంతోమంది వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియాకు వస్తూనే ఉంటారు. కొంతమంది ఆసుపత్రుల్లో జాయిన్ ఐతే, మరికొంతమంది నెలల తరబడి చికిత్స పొందుతూనే ఉంటారు. ఈ రెండు జనరల్ ఆసుపత్రులు తెలంగాణలో పేరుగాంచినవి.. ప్రతిరోజు ఓపీనే వేలల్లో ఉంటుంది. వేల మంది చికిత్స కోసం వస్తుండగా, నిత్యం వందలాది మంది ఆడ్మిట్ అవుతూనే ఉంటారు. కాని ప్రతిరోజు ఈ రెండు ఆసుపత్రులలో మరణాల సంఖ్య ఏలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేసింది యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ..
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు వివిధ రోగాల కారణంగా ఎంతమంది చనిపోతున్నారు. వారికి సంబంధించిన సంఖ్యను 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకు ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది. ఇందుకు రెండు ఆసుపత్రులలోని పిఐఓలు సమాచారాన్ని పంపించంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మీడియాకు అందించారు.
ఉస్మానియా ఆసుపత్రి
2019 నుంచి మార్చి నుంచి 2023 మార్చి వరకు ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటివరకు జరిగిన మరణాల సంఖ్య 27,450మంది అని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రతి నెలకు సుమారుగా 560మంది వివిధ రోగాల కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. మరణించిన వారి పేర్లను మాత్రం ఎవరికి ఇవ్వలేమని, దర్యాప్తు అధికారులకు మాత్రమే అందజేస్తామని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పిఓవో తెలిపారు.
గాంధీ ఆసుపత్రి
2019 నుంచి సమాచారం ఇవ్వడానికి మాకు సమయం లేదని మేము అందుకు పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. 2023 నుంచి జనవరి నుంచి మాత్రం సమాచారం ఇస్తున్నామని తెలిపారు. 2023 జనవరిలో 802మంది, పిబ్రవరిలో 712మంది, మార్చిలో 756మంది చనిపోయారని సమాచారం ఇచ్చారు.