
నోబెల్ ప్రైజ్ మనీని ఈ ఏడాది నుంచి పెంచనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. నోబెల్ విజేతలకు ఈ ఏడాది అదనంగా మరో 1 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను ఇస్తామని మొత్తంగా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను(9,86,000 డాలర్లను) అందచేస్తామని శుక్రవారం ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో ప్రైజ్ మనీ పలుమార్లు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఫౌండేషన్ ఆర్థిక స్థితి బలంగా ఉన్నందుకు ప్రైజ్ మనీని కూడా పెంచినట్లు తెలిపింది.
2012లో నోబెల్ ఫౌండేషన్ ప్రైజ్ మనీని 10 మిలియన్ల క్రోనార్ల నుంచి 8 మిలియన్లకు తగ్గించింది. 2017లో 9 మిలియన్ క్రోనార్లు ఉన్న ప్రైజ్ మనీని 10 మిలియన్లకు పెంచింది. 2017 నుంచి ఇదే ప్రైజ్ మనీ కొనసాగుతోంది. గత దశాబ్ధకాలంలో స్వీడిష్ క్రోనార్ విలువ యూరోతో పోలిస్తే 30 శాతం కోల్పోయింది. ప్రస్తుతం దీని నోబెల్ బహుమతి ఆర్థిక విలువను పెంచినా..స్వీడన్ వెలుపల పెద్దగా పెరిగనట్లు కనిపించదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని అత్యున్నత అవార్డుగా భావిస్తారు. 1901లో ప్రారంభమైన ఈ బహుమతిని భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి, వైద్యరంగంలో ఇస్తున్నారు. 1969 నుంచి ఆర్థిక రంగంలో కూడా అవార్డును ప్రారంభించారు.