టెట్ పరీక్షా కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి

Share On

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష హాళ్లలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన టెట్ ఎగ్జామ్ లో విషాదం చోటుచేసుకుంది. సమయం కంటే ముందే హాజరు కావాలని 8నెలల నిండు గర్భణీ ఎగ్జామ్ రాసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్ హాల్లో కుప్పకూలిపోయింది. స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

గచ్చిబౌలిలో అరుణ్, రాధిక నివాసం ఉంటున్నారు. రాధిక 8 నెలల గర్భవతి. రాధిక టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది. అయితే శుక్రవారం టెట్ ఎగ్జామ్ ఉండటంతో సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు భర్త అరుణ్ తో కలిసి రాధిక వెళ్లింది. పరీక్షకు వెళ్లే తొందరలో తను ఎనిమిది నెలల గర్భవతి అనే సంగతి మరిచింది. పరిగెత్తుకుంటు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. తన గదిలోని సీటులో కూర్చొంది ఇంతలోనే రాధికకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే రాధిక పడిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. రాధిక పడిపోవడం ఉపాధ్యాయులకు చెప్పడంతో రాధికపై నీళ్లు చెల్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఉన్న పోలీసులకు, యాజమాన్యానికి చెప్పడంతో వెంటనే రాధికను పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాధికను వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఎగ్జామ్ హాల్ కు తొందరగా వెళ్లాలనే టెన్షన్ తోనే ఇలా జరిగిందని వాపోయాడు. రాధిక మృతితో భర్త అరుణ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu