
అనంత్‌నాగ్ కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలోని నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని, పదికిపైగా బృందాలు మోహరించినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. అటవీ ప్రాంతం దట్టంగా ఉండడంతో కాస్త ఇబ్బంది ఎదురవుతుందని, రిస్క్ ఎక్కువగా ఉన్న చోట కొన్ని ఆపరేషన్లు ఉంటాయని, ఈ సమయంలో నష్టం జరిగే అవకాశాలుంటాయన్నారు. ధైర్యంతో బలగాలు ముందుకుసాగుతున్నాయన్నారు. ఇది వ్యూహాత్మక తప్పిదానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంభిస్తూ పర్వతాలు, అడవులు, గుహలాంటి ప్రదేశాలను వినియోగించుకుంటూ భద్రతా బలగాలకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇందుకోసం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన ధైర్యవంతులైన ఆఫీసర్స్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రాంతంలో చాలా కఠినమైన ప్రాంతమన్నారు.
ఎత్తైన ప్రదేశం కావడంతో పాటు దట్టంగా అటవీ ఉందని, అందులో రహస్య స్థావరం ఉందన్నారు. ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 13న ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ అధికారులతో పాటు పోలీస్ డీఎస్పీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో మరో సైనికుడు సైతం వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్లతో గ్రెనేడ్లతో దాడులు నిర్వహించింది.