
తెలంగాణ రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడిన సోనియాగాంధీ.. తెలంగాణ ప్రజలకు ఆరు వాగ్దానాలను ఇచ్చారు. తెలంగాణ ప్రజల కొరకు రాష్ట్రాన్ని ఇచ్చానని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఋణం తీసుకోవాలని అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500
పేద మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు. కౌలు రైతులకు ఇది వర్తింపు
భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు
వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
చేయూత పథకం కింద రూ.10లక్షల ఆరోగ్య బీమా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు
యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షల వరకు సాయం.
చేయూత కింద నెలకు రూ.4వేల పింఛను
మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం: ఖర్గే
బిజెపి, బిఆర్ఎస్ రెండు ఒకటే
బిజెపి, బిఆర్ఎస్ రెండూ జూటా పార్టీలేనని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆ రెండు పార్టీలు తిట్టుకున్నట్టు నటిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటారు. భాజపాకు భారాస బీ టీమ్‌గా మారింది. పైకి విమర్శలు చేసుకునే మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చక్కగా అబద్ధాలు చెప్పారు. పదేళ్లుగా దేశంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రధానులు ఎన్నో భారీ సంస్థలు నెలకొల్పారు. కాంగ్రెస్ నెలకొల్పిన సంస్థలను భాజపా సర్కారు అమ్ముకుంటూ వస్తోంది. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు అని ఖర్గే విమర్శించారు.