భారాస, భాజపా, ఎంఐఎం అన్ని ఒకటే

Share On

తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు వాగ్ధానాలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు అవినీతిలో కూరుకు పోయిందని విమర్శించారు. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చిందన్నారు.
మోదీ కనుసైగ చేయగానే భారాస, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ సభకు ఆటంకం కలిగించేందుకు భారాస, భాజపా,ఎంఐఎం యత్నించాయి. తెలంగాణలో భారాస, భాజపా, ఎంఐఎంతో పోరాటం చేస్తున్నాం. భారాస, భాజపా, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేవలం ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోంది. వంద రోజుల్లో భారాస సర్కారును గద్దె దించడం ఖాయం. తొమ్మిదేళ్ల భారాస పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదు. ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం.. అధికారంలోకి రాగానే అమలు చేస్తాం అని ప్రకటించారు.

గ్యాస్‌ సిలిండర్‌ రూ.500లకే ఇస్తాం.

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు ఇస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం. మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసింది. మేం అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే ఇస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువ వికాసం కింద యువతకు కాలేజీ, కోచింగ్‌ ఫీజు కోసం రూ.5లక్షల వరకు ఇస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల బీమా సదుపాయం. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. చేయూత పింఛను ద్వారా రూ.4వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఇస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన రోజే హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్‌ ద్వారా భూములు లాక్కున్నారు. రైతు బంధు వల్ల పెద్ద రైతులకే మేలు జరిగింది. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన ఉన్నట్టే దేశంలో మోదీ పాలన ఉంది అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu