
చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. కానీ చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే కాకరకాయలో ఉన్న చేదును తొలగించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. కాకరకాయను కోసి ఉప్పు కలిపిన నీటిలో కొంత సమయం ఉంచాలి. అప్పుడు చేదు కొంత తగ్గుతుంది. అంతేకాకుండా.. తేనే లేదా చక్కెర వేసిన నీటిలో కాకరకాయ వేస్తే చేదు తగ్గుతుంది. పెరుగులో కూడా కాసేపు వాటిని వేసి ఉంచితే.. చేదు తగ్గుతుంది. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది..
కాకరకాయ అద్భుతమైన రక్త శుద్ధిగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి.
మధుమేహానికి దివ్యౌషధం..
కాకరకాయలో ఉండే చరంటిన్ మూలకం శరీరంలోని బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో పాలీపెప్టైడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పెరిగిన రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ వలె పనిచేస్తుంది.
బిట్టర్ ప్రెజర్ కు మేలు చేస్తుంది..
కాకరకాయలో ఉండే పొటాషియం మన శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా ఇది తినడం వల్ల న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది. అందుకే చేదు మొత్తం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.