
సోషల్ మీడియా వాళ్ల ఎవరి జీవితం, ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావడం లేదు. చిన్న అజాగ్రత్త చిన్న, పెద్ద, పేద, ధనిక అనే సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కిలాడీ లేడీ ప్రేమ వ్యవహారం, ఆమె బ్లాక్ మెయిల్ నాటకాలకు ఆ సైనికుడు బలి అయ్యాడు. కర్ణాటకలోని కొడుగుకు చెందిన సైనికుడి సందేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. సైనికుడిని మోసం చేసి అతని చావుకు కారణమైన మహిళను జీవిత అనే మహిళగా గుర్తించారు. పెళ్లయిన సైనికుడు సందేష్ ను ప్రేమ పేరుతో వలలో వేసుకున్న జీవిత అతన్ని బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులు అన్నారు. కర్ణాటకలోని కొడుగుకు చెందిన సందేష్ భారత ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. సందేష్ ఇంతకు ముందే వివాహం అయ్యి పిల్లలు ఉన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్యోగం చేస్తున్న సందేష్ సెలవుల్లో కొడుగుకు వచ్చి భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవాడు. సందేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో జీవిత అనే మహిళ సందేష్ కు పరిచయం అయ్యింది.
నువ్వు ఉగ్రవాదులతో పోరాటం చేసిన రియల్ హీరో, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీతో శారీరక సుఖం పొందాలని అనుకుంటున్నానని జీవిత సైనికుడు సందేష్ ను రెచ్చగొట్టింది. సందేష్ కు మాయమాటలు చెప్పిన జీవిత అతన్ని వలలో వేసుకుంది. సందేష్ పర్సనల్ ఫోటోలు సేకరించిన జీవిత తరువాత సైనికుడి జీవితంతో చెలగాటం ఆడింది. సైనికుడు సంతోష్ తో రొమాన్స్ చేసిన వీడియోలు అడ్డం పెట్టుకున్న జీవిత అతన్ని టార్చర్ పెట్టింది. తరువాత జీవిత ఆమె స్నేహితులు కలిసి సైనికుడు సందేష్ ను బ్లాక్ మెయిల్ చేసి అతని నుంచి రూ 20 లక్షలు డబ్బుతో పాటు, కారు, ఆస్తి పత్రాలు లాక్కొనింది. అంతటితో సందేష్ ను వదిలిపెట్టని జీవిత, ఆమె ఫ్రెండ్స్ రూ 50 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో నీ నగ్న ఫోటోలు అప్ లోడ్ చేస్తామని బెదిరించారు.
సోషల్ మీడియాలో నీ నగ్న ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తే నీ భార్య, పిల్లలు నీకు దూరం అవుతారని, నీ ఉద్యోగం ఊడిపోతుందని జీవిత, ఆమె ఫ్రెండ్స్ కలిసి సైనికుడు సందేష్ ను పదేపదే బెదిరించారు. టార్చర్ ఎక్కువ కావడం, అప్పటికే ఉన్న డబ్బులు, కారు, ఆస్తి పత్రాలు పోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సందేష్ అతని భార్య యశోధాకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. నీకు తోడుగా నేను ఉంటానని, నువ్వు ఎవ్వరికి డబ్బులు ఇవ్వనసరం లేదని యశోధా సైనికుడు సంతోష్ కు ధైర్యం చెప్పింది. అయితే జీవిత టార్చర్ తట్టుకోలేక డెత్ నోట్ రాసిపెట్టిన సైనికుడు సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త సందేష్ ఆత్మహత్యకు జీవిత, ఆమె స్నేహితులు కారణం అని సందేష్ భార్య యశోధా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.