
నల్గొండ మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో ఐటీసోదాలు చేస్తొంది. నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ముఖ్య అనుచరుల ఇండ్లలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. 40 చోట్ల 30 టీమ్ లతో ఈ ఏకకాలంలో సోదాలు కొనసాగుతోన్నాయి. భాస్కర్ రావు అనుచరుడు కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైదేహి టౌన్ షిప్ లో ఉన్న నివాసంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాన్ స్టాప్ గా సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలోలో భారీగా డబ్బులు నిల్వచేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహిస్తోన్నట్ల తెలుస్తోంది. అటు నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల ఇండ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతోన్నాయి. నెహ్రూ గంజ్ లోని మహేంద్ర ఆయిల్ మిల్ ఓనర్ మహేందర్ రవీంద్ర ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, కె.నరేంద్రరెడ్డి ఇండ్లలో ఐటీ సోదాలు జరిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రెయిడ్స్ మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగాయి.
హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.5 కోట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి మై హోమ్ బూజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ప్రదీప్‌రెడ్డి, నరేంద్రరెడ్డి ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో డైరెక్టర్స్ హోదా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వారు రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్తలతో కలిసి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి అకౌంట్స్‌లో పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఐటీ ఇంటెలిజెన్స్ గుర్తించడంతో సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని మైహోమ్ బూజాతో పాటు వట్టినాగులపల్లి, రామచంద్రాపురం, అమీన్‌పూర్ పటేల్‌గూడ, మియాపూర్ సహా ఫార్మా కంపెనీకి చెందిన పలువులు అకౌంటెంట్ల ఇళ్లలో రైడ్స్ నిర్వహించారు. సోదాలకు నాలుగు రోజుల ముందు నుంచి ప్రదీప్‌రెడ్డితో సంప్రదింపులు జరిపిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను కాల్‌డేటా కూడా పరిశీలించారు.ప్రదీప్ రెడ్డి ఐటీ రిటర్న్స్ తోపాటు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ వివరాలను కూడా తెలుసుకున్నారు.