రాత్రి 7 గంటలలోపు తింటే ఎన్నో లాభాలు

Share On

మనిషి రోజురోజుకు ఎంత బిజీగా మారుతున్న, ఎంత సంపాదిస్తున్న సమయానికి తినకుంటే మాత్రం అనారోగ్యానికి గురికావాల్సిందే. నిత్యం మనం తీసుకునే ఆహారంపైనే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు ప్రజలు ఎలాంటి వ్యాధుల బారినపడకుండా, ఎక్కువ కాలం జీవించే వారు. కానీ ప్రస్తుతం 40 ఏళ్లకే బీపీ, షుగర్లు వెంటాడుతున్నాయి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన విధానం పూర్తిగా మారిపోవడం వెరసి మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీప్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయి. ఇక ఒకప్పుడు రాత్రి భోజనం వీలైనంత త్వరగా పూర్తి చేసుకునే వారు. రాత్రి త్వరగా పడుకొని ఉదయం, త్వరగా నిద్రలేచేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. పనివేళల్లో మార్పుల కారణంతో రాత్రుళ్లు ఆలస్యంగా తింటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే రాత్రి త్వరగా భోజనం చేసే వారు ఎక్కువ కాలం జీవిస్తారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి 7 గంటలలోపు డిన్నర్ పూర్తి చేసుకునే వారు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో వెల్లడైంది.

రాత్రి భోజనం చేసే సమయం, మనిషి ఆయుష్షుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై పరిశోధనలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌ అనే జర్నల్‌లో అధ్యాయనానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఇటలీలోని అబ్రుజ్జోలోని ఎల్‌ అక్విల్ అనే ప్రావిన్స్‌ ప్రాంతం.. 90 నుంచి 100 ఏళ్ల వయసున్న జనాభా అధికంగా ఉన్న ప్రాంతంగా పేరుగాంచింది. ఇక్కడి ప్రాంత ప్రజలను పరిగణలోకి తీసుకుని చేసిన అధ్యయనంలోనే పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 70 మందిని పరిగణలోకి తీసుకొని వారి ఆహార పద్ధతులపై, ముఖ్యంగా వారు రాత్రి భోజనం చేసే సమయాలను అధ్యయనంలో భాగంగా పరిశీలించారు.

ఇందులో తేలిన వివరాల ప్రకారం.. ఇక్కడి ప్రజలు రాత్రి 7 గంటలకల్లా డిన్నర్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వీరు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు, రాత్రి భోజనానికి మరుసటి రోజు మధ్యాహ్న భోజనానికి మధ్యా ఏకంగా 17.5 గంటల వ్యవధి ఉండేలా చూసుకుంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇక సర్వేలో పాల్గొన్న వారు ఎక్కువగా తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చిక్కుల్లను అధికంగా తీసుకుంటున్నట్లు తేలింది. అలాగే వీరు మాసం, ప్రాసెస్‌ చేసిన మాంసం, గుడ్లు, స్వీట్స్‌కు దూరంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. మొక్కల నుంచి వచ్చే ఆహారా పదార్థాలను తీసుకోవడం శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో పాటు.. క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే ఇక్కడి ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆహారపు అలవాట్లతో పాటు వీరు చురుకైన జీవనశైలిని కలిగిఉన్నట్లు, అదే వీరు ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు సహకరించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu