
గ్రామాలు అభివృద్ది చెందాలి.. గ్రామ అభివృద్ది కోసం వచ్చే నిధులన్నీ నిజాయితీగా ఖర్చు పెట్టాలి.. ప్రతి గల్లీలో రోడ్లు ఉండాలి.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. వీధిలో లైట్లు ఉండాలి వాటన్నింటికి నిధులు వస్తాయి కాని చాలా గ్రామాల్లో నిధులన్నీ సర్పంచ్‌లు కాజేస్తూ గ్రామాలు అభివృద్దికి చెందకుండా అడ్డుకుంటున్నారు. తమ గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి. ఎంత ఖర్చు చేస్తున్నారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా చేసిన పనులకు, పెట్టిన ఖర్చులకు సంబంధం లేకుండా ఉంది.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్లలు గ్రామంలో గ్రామ పంచాయితీ నిధులన్నీ సర్పంచ్ పక్కదారి పట్టించారు. వార్డు సభ్యులకు సంబంధం లేకుండానే సమావేశం పెట్టి నిధులన్నీ కాజేశారు. గ్రామ సభ సైతం నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2019 ఆగస్టు 30 తేదీన 26,00,000 లక్షల నిధులు దుర్వినియోగం కాగా ప్రస్తుత సర్పంచ్ గెలిచిన 6 నెలలకే ఒకేసారి 26 లక్షల డబ్బులు తీసారని వార్డు సభ్యులమైన తాము ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారు అంటున్నారు. 30 రోజుల ప్రణాళికలో 12 రోజులు ట్రాక్టర్ పని చేసినట్టు రికార్డ్ చేసి 31200బిల్లు తీసుకున్నారు. కానీ ట్రాక్టర్ యజమానికి మాత్రం 13000 ఇచ్చినట్లు తెలుస్తుంది. డోజర్ 33 గంటల 15 నిమిషాల పని చేస్తే, అందుకు వచ్చిన డబ్బులు 26600 కాగా కాని డోజర్ యజమాని కి ఇచ్చింది 19500 అని తెలుస్తుంది. గంగ రోడ్డు సైడ్ కు ఉన్న తుమ్మ చెట్లు గ్రామ సఫాయి వాళ్ళ తో నరికించారు. కానీ రికార్డు లో 5000 బిల్లు తీసుకున్నారు. మోటర్ రిపైర్ కోసం 1 లక్ష రూపాయలు సర్పంచ్ ఖాతాలో జమ చేసుకున్నారు. పైపులు గేట్ వాల్స్ కొనుగోళ్ల కోసం 69,000 వేలు డ్రా చేసినారు. మోటార్ రిపేర్ కోసం, కొత్త మోటర్ కోసం మరియు పైపులైన్ కొనుగోలు కోసం 96,000వేలు, మోటార్ రిపేర్ మరియు కొత్త స్టస్టేర్ కొనుగోలు కోసం 6300/- డ్రా చేసినారని పూర్తి ఆధారాలతో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు స్పందనే లేదని గ్రామస్థులు, వార్డు సభ్యులు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు అంటున్నారు. గ్రామ అభివృద్ది కోసం వచ్చిన నిధులను కాజేసిన సర్పంచ్‌పై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకొవాలని లేని పక్షంలో ఆందోళన చేపడుతామని అంటున్నారు.