ఆట‌లో అంత‌ర్జాతీయ చాంఫియ‌న్‌.. బ‌తుకుదెరువు కోసం లిక్క‌ర్ వ్యాపారం

Share On

దేశం కోసం ఇర‌వై నాలుగు గంట‌లు క‌ష్ట‌ప‌డి, ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త‌కాలు సాధించిన‌వారు కొద్దిమందే ఉంటారు. ప‌త‌కాలు వ‌చ్చిన‌ప్పుడే వారిని పొగుడుతూ, అభినందించే వారికి కొద‌వ‌లేని దేశం మ‌న‌ది. కాని వారి జీవిత ప్ర‌యాణం ఏలా సాగుతుందో ఎవ‌రూ ప‌ట్టించుకోరు. తెలిసినా ముందుకు వ‌చ్చి ఆదుకునే వారు చాలా త‌క్కువే.. అలాంటి ఒక‌ మట్టిలో మాణిక్యం జార్ఖండ్‌‌కు చెందిన బిమ్లా ముండా అనే యువ క్రీడాకారిణి. నేషనల్ కరాటే చాంపియన్ అయిన బిమ్లా 34వ నేషనల్ గేమ్స్‌‌లో సిల్వర్ మెడల్ గెలిచింది. 2014లో నిర్వహించిన అక్షయ్ కుమార్ ఇంటర్నేషనల్ చాంపియన్‌‌షిప్‌‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గింది. దీంతోపాటు దేశానికి, రాష్ట్రానికి ఎన్నో మరపురాని విజయాలు, పతకాలను అందించింది. కాని ఆమె జీవితం ఇప్పుడు అత్యంత దీన ప‌రిస్థితిలో ఉంది.

ఎన్ని పతకాలు సాధించినా బిమ్లాకు ప్ర‌భుత్వ ఉద్యోగం దొరకలే. ఆమె తల్లి దినసరి కూలీ. కరాటే లాంటి ఆటల్లో ముందుకెళ్లడానికి ఆర్థిక ప్రోత్సాహం, చేయూత అవసరం. బిమ్లాకు అవసరమైన చేయూతను అందించేవారు కరువయ్యారు. ఆమె తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వారి ఇల్లు గడవడం కష్టమైంది. దీంతో హండియాగా పిలిచే రైస్ బీర్‌‌ను అమ్ముతూ బిమ్లా తన కుటుంబాన్ని పోషిస్తోంది. అద్భుతమైన ప్రతిభ ఉన్నా ఆదుకునే వాళ్లు లేకపోవడంతో బిమ్లా త‌న ఆట‌ను కొన‌సాగించ‌లేక‌పోతుంది. కుటుంబ పోషణ కోసం ఆమె లిక్కర్‌‌ అమ్ముతుండటంపై చాలా మంది బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ లోకల్ జర్నలిస్ట్ ద్వారా బిమ్లా గురించి తెలుసుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆమెను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బిమ్లాకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించాలని డిప్యూటీ కమిషనర్‌‌ను సోరెన్ ఆదేశించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *